Rahul Gandhi : రాజ్యాంగదినోత్సవం సందర్భంగా మోడీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

సావర్కర్ మాటలు రాజ్యాంగంలో ఉన్నాయా అని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.

Update: 2024-11-26 11:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సావర్కర్ మాటలు రాజ్యాంగంలో ఉన్నాయా అని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘నిజం-అహింస’లతో కూడిన మహోన్నత పుస్తకం రాజ్యాంగం అన్నారు. సామాజిక సాధికరతకు బాటలు వేసిన అంబేడ్కర్, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే, గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీల ఆలోచనల ప్రతిబింబమే రాజ్యాంగం అన్నారు. హింసను కొనసాగించాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రజలను చంపుతూ అబద్ధాలతో ప్రభుత్వాలను నడపాలని రాజ్యాంగం చెప్పిందా అని ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని చదవలేదని.. ఒక వేళ చదివి ఉంటే ప్రతి రోజు ఇలాంటి పనులు చేసేవారు కాదన్నారు. కులగణనను తెలంగాణలో చేపడుతున్నామని.. ఇది చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. మూసి ఉన్న గదుల్లో 10-15 మందికి కుల గణన చేయడం లేదని లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. అందులో దళితులు, ట్రైబల్స్, బీసీలు, మైనార్టీలు, పేదలు ఉన్నారన్నారు. సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా మైక్ కట్ కాగా పర్లేదు ఎన్నీ సార్లు మైక్ కట్ చేసినా ప్రజా సమస్యలపై మాట్లాడుతునే ఉంటానని రాహుల్ అన్నారు. ఈ దేశంలో 3వేల సంవత్సరాల నుంచి వెనకబడిన వర్గాల గురించి మాట్లాడేటప్పుడు మైకులు కట్ అవుతూనే ఉన్నాయని రాహుల్ అన్నారు. రోహిత్ వేముల ఫొటో మన వెనక ఉందని.. అతను మాట్లాడాలని ప్రయత్నిస్తే ఆయన గొంతునే తీసేసుకున్నారని రాహుల్ అన్నారు.


Also Read:

BJP : రాష్ట్రపతిని అవమానించిన రాహుల్ గాంధీ! బీజేపీ ఆరోపణలు.. వీడియో వైరల్

Tags:    

Similar News