Chirag Paswan : కేంద్రం నిర్ణయానికి మేం వ్యతిరేకం.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-19 12:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా కేంద్ర ప్రభుత్వ లేటరల్ ఎంట్రీ నియామక పద్ధతిని వ్యతిరేకిస్తున్నానని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు 45 మంది కార్యదర్శులు/సంయుక్త కార్యదర్శులను ప్రైవేటురంగం నుంచి నియమించుకోవడం సరికాదన్నారు. ఇలాంటి విధానాలు, నిర్ణయాలను తమ పార్టీ సమర్ధించబోదని చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు.

బీసీలు, అన్ని కులాలకు రిజర్వేషన్లను తమ పార్టీ సమర్ధిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. లేటరల్ ఎంట్రీ పద్దతి ద్వారా కేంద్ర క్యాబినెట్ కార్యదర్శులు/సంయుక్త కార్యదర్శులను నియమించాలనే ఆలోచన ముమ్మాటికీ తప్పే అని చిరాగ్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం వద్ద తాను తప్పకుండా లేవనెత్తుతానని ఆయన చెప్పారు. ‘‘ప్రభుత్వ నియామకాలు అనేవి రిజర్వేషన్ల నిబంధనల ప్రకారమే జరగాలి. అదే మా పార్టీ వాదన’’ అని ఎల్‌జేపీ చీఫ్ తెలిపారు.

Tags:    

Similar News