Tamil Nadu assembly: తమిళనాడు అసెంబ్లీ నుంచి బీజేపీ, ఏఐడీఎంకే వాకౌట్

తమిళనాడు అసెంబ్లీలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్) కుంభకోణంపై రసాభాస జరిగింది.

Update: 2025-03-14 10:07 GMT
Tamil Nadu assembly: తమిళనాడు అసెంబ్లీ నుంచి బీజేపీ, ఏఐడీఎంకే వాకౌట్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్) కుంభకోణంపై రసాభాస జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య సభ నుంచి బీజేపీ(BJP), అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIDMK) వాకౌట్ చేశాయి. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్)లో అవినీతి జరిగిందని డీఎంకేపై ప్రతిక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ స్కాంపై బీజేపీ చీఫ్ అన్నామలై మాట్లాడుతూ.. “మేము బడ్జెట్ సమావేశాల నుంచి వాకౌట్ అయ్యాం. ప్రస్తుతం టాస్మాక్ ఒక పెద్ద సమస్య. ఈపీఎస్ కూడా వాకౌట్ చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం మారింది. టాస్మాక్ నుంచి ప్రభుత్వానికి రూ. 50 వేల కోట్లు సంపాదిస్తున్నారు. కానీ, రాష్ట్ర అప్పు రూ. 9 లక్షల కోట్లకు పైగా ఉంది. ఈ బడ్జెట్‌లో ఉత్పాదకత ఏమీ లేదు ”అని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ నిరసనగా నల్ల చీర ధరించి సెషన్‌కు హాజరయ్యారు. "డీఎంకే ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోయింది. కోర్సుల్లో తమిళాన్ని ఉపయోగించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. కానీ, తమిళం, తమిళ సంస్కృతి పేరోత దేశ చిహ్నానికి వ్యతిరేకంగా వెళ్లడానిక ప్రయత్నిస్తున్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం" అని ఆమె అన్నారు.

డీఎంకే ప్రభుత్వం దిగిపోవాలి

టాస్మాక్ మద్యం అమ్మకాలలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలు చేసింది. కాగా.. ఈ విషయాన్నే ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేవెనత్తారు. కానీ, దీనిపై చర్చ జరిపేందుకు స్పీకర్ నిరాకరించడంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి అసెంబ్లీ వాకౌట్ చేశారు. మరోవైపు, సోమవారం ఈడీ ఆరోపణలపై చర్చలకు అనుమతి ఇస్తానని స్పీకర్ ఎం. అప్పావు ప్రకటించారు. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ, డీఎంకే ప్రభుత్వం రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె. పళనిస్వామి డిమాండ్ చేశారు.

READ MORE ....

Yediyurappa : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి బిగ్ రిలీఫ్


Tags:    

Similar News