Trump: భారత్‌తో అదొక్కటే సమస్య.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్

భారత్ అమెరికా సంబంధాలపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో తనకు మంచి సంబంధం ఉందని తెలిపారు.

Update: 2025-03-20 17:23 GMT
Trump: భారత్‌తో అదొక్కటే సమస్య.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ అమెరికా సంబంధాలపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో తనకు మంచి సంబంధం ఉందని, కానీ ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఇండియా ఒకటని తెలిపారు. ఇదొక్కటే భారత్‌తో ఉన్న ఏకైక ప్రాబ్లమ్ అని చెప్పారు. తాజాగా ఆయన బ్రీట్‌బార్ట్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ సుంకాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ టారిఫ్స్ తగ్గించకుంటే ఏప్రిల్ 2 నుంచి తాము కూడా అదే తరహాలో సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ఇండియా-పశ్చిమ ఆసియా-యూరప్ ఆర్థిక కారిడార్ గురించి ట్రంప్ స్పందిస్తూ.. ఇది గొప్ప దేశాల సమూహం అని కొనియాడారు. ఈ కారిడార్ యూఎస్ వాణిజ్యానికి హాని కలిగించాలనుకునే దేశాలను ఎదుర్కొంటుందని నొక్కి చెప్పారు.

తమకు శక్తివంతమైన వాణిజ్య భాగస్వాముల సమూహం ఉందన్నారు. వారు ఎప్పటికీ చెడుగా ప్రవర్తించలేరని తెలిపారు. స్నేహితులతో పోలిస్తే శత్రువులతోనే చాలా విధాలుగా మెరుగ్గా వ్యవహరిస్తామన్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టారిఫ్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ యూఎస్‌పై సుంకాలను తగ్గించడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. అయితే దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని భారత్ తెలిపింది. దీంతో మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags:    

Similar News