గాలివాన బీభత్సం.. ఉరేగింపులో నేలకొరిగిన 150 ఫీట్ల రథం
150 ఫీట్ల ఎత్తైన భారీ రథం ఉరేగిస్తుండగా గాలివాన సృష్టించిన బీభత్సం వల్ల రథం కూలిపోయింది. ఈ విషాద సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డనగమంగల గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: 150 ఫీట్ల ఎత్తైన భారీ రథం (huge chariot) ఉరేగిస్తుండగా గాలివాన సృష్టించిన బీభత్సం వల్ల రథం కూలిపోయింది. ఈ విషాద సంఘటన కర్ణాటక రాష్ట్రం (Karnataka State) లోని దొడ్డనగమంగల గ్రామంలో చోటు చేసుకుంది. భక్తులు రథాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తుండగా.. భారీ వర్షం. ఈదురు గాలుల కారణంగా రథం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక భక్తుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. రథం వెంట వేల సంఖ్యలో భక్తులు ఉన్నప్పటికి గాలివాన బీభత్సం వల్ల.. ఎవరు దానిని ఆపలేకపోయారు. ప్రతిష్టాత్మక హుస్కూర్ మద్దురమ్మ జాతర లో శనివారం సాయంత్రం రెండు రథాలు కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు.
మృతులను తమిళనాడులోని హోసూర్‌కు చెందిన రోహిత్ (26), బెంగళూరులోని కెంగేరికి చెందిన జ్యోతి (14)గా గుర్తించారు. లక్కసంద్ర కు చెందిన రాకేష్, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అలాగే జాతరకు తీసుకువస్తున్న దొడ్డనాగరమంగళ గ్రామ రథం చిక్కనగరమంగళ సమీపంలో కూలిపోయింది. ఈ సంఘటనలో ఎవరూ మరణించలేదు. మరోవైపు, ఆలయం సమీపంలోని రాయసంద్ర గ్రామ రథం ప్రజలపై పడింది. ఈ సంఘటనలో భక్తులు రథం (chariot) కింద చిక్కుకున్నారు. ఇదిలా ఉంటే హుస్కూర్ మద్దురమ్మ జాతర లో వివిధ గ్రామాల మధ్య రథం ఎత్తును పోటాపోటిగా నిర్వహిస్తారు. దీంతోనే ఆయా గ్రామాల ప్రజలు తమ రథం అన్నింటి కంటే ఎత్తుగా ఉండాలని పోటీలో భారీ ఎత్తున రథాలను ఏర్పాటు చేస్తారు.
ఈసారి గట్టు హళ్లి గ్రామస్తులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కొత్త రథం నిర్మించడం విశేషం. ఈ జాతరలో రథం ఎత్తు గ్రామ ప్రతిష్ఠకు సంబంధించిన విషయం. అందువల్ల రథాలను నిర్మించే గ్రామస్తులు ప్రతి సంవత్సరం ఈ 'రథయాత్ర'ను పోటీగా చూస్తుండటంతో జాతర ఉత్సాహం పెరుగుతుంది. ఈ సంవత్సరం జాతరలో మొత్తం ఆరు రథాలు పాల్గొన్నాయి. మద్దురమ్మ ఆలయానికి దాని స్వంత చరిత్ర ఉంది. ఈసారి, దొడ్డనాగమంగళ, రాయసంద్ర, లక్ష్మీనారాయణపుర, గట్టహళ్లి, కోదతి, సంజీవనగర్ నుండి రథాలు హుస్కూర్ జాతరకు వచ్చాయి.