Canada : కెనడాలో భారత యువతిపై దాడి

కెనడా(Canada)లో భారతీయుల(Indians)పై విద్వేషం(Racism) నానాటికీ పెరుగుతోంది.

Update: 2025-03-25 16:42 GMT
Canada : కెనడాలో భారత యువతిపై దాడి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : కెనడా(Canada)లో భారతీయుల(Indians)పై విద్వేషం(Racism) నానాటికీ పెరుగుతోంది. తాజాగా ఓ దుండగుడు భారత యువతిపై దాడికి తెగబడ్డాడు(Violent Attack). ఆమె గొంతు నులుముతూ హత్యాయత్నం చేశాడు. కాపాడాలంటూ యువతి అరుస్తున్నా ఎవరూ సహాయం చేయడానికి రాలేదు. అయితే, జనం పెరుగుతుండటంతో దుండగుడు ఆమెను అక్కడే గోడకేసి కొట్టి పారిపోయాడు. కాల్గరి(Calgary)లోని బో వ్యాలీ కాలేజీ రైల్వేస్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాల్గరీ పోలీసులు అరగంటలోనే నిందితుణ్ణి అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. బ్రేడన్ జోసెఫ్ జేమ్స్ ఫ్రెంచ్ అనే 31 ఏళ్ల వ్యక్తి ఈ దాడికి పడ్డట్టు తెలిపారు. అయితే ఇది జాతి ఆధారిత దాడి కాదని, దొంగతనం చేసే ఉద్దేశంతో జరిగిన దాడిగా పేర్కొన్నారు. బాధితురాలికి వైద్య సహాయం అందిస్తున్నామని వెల్లడించారు.

Tags:    

Similar News