Breaking:సీఎంకు తృటిలో తప్పిన పెను ముప్పు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్?

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) ఇవాళ(బుధవారం) ఆగ్రాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2025-03-26 15:03 GMT
Breaking:సీఎంకు తృటిలో తప్పిన పెను ముప్పు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్?
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) ఇవాళ(బుధవారం) ఆగ్రాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆగ్రా పర్యటనలో ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్యాహ్నం 3.40కు పర్యటన ముగించుకుని బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న ఛార్టెడ్ ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.

విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకు సాంకేతిక సమస్య(Technical problem) తలెత్తిందని పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ తరుణంలో ఆగ్రాలోని ఖేడియా ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అధికారులు ఢిల్లీ(Delhi) నుంచి మరో విమానాన్ని రప్పించి ఆయనను లక్నోకు తీసుకెళ్లారు. కాగా ఆ ఫ్లైట్ వచ్చే వరకు దాదాపు గంటన్నర సేపు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రా ఎయిర్ పోర్ట్ లాంజ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News