Prashant Kishor: బిహార్ ఓ విఫలమైన రాష్ట్రం.. జన్ సురాజ్ పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు

జన్ సురాజ్ పార్టీ(Jan Suraaj party) అధినేత, ఎన్నికల మాజీ వ్యూహకర్త, ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) బిహార్(Bihar) అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-25 05:02 GMT
Prashant Kishor: బిహార్ ఓ విఫలమైన రాష్ట్రం.. జన్ సురాజ్ పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: జన్ సురాజ్ పార్టీ(Jan Suraaj party) అధినేత, ఎన్నికల మాజీ వ్యూహకర్త, ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) బిహార్(Bihar) అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ను "విఫలమైన రాష్ట్రం"గా అభివర్ణించారరు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. అమెరికాలోని బిహారీ ప్రవాసులతో వర్చువల్ ప్రసంగించారు. బిహార్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందన్నారు. ఒకవేళ బిహార్ ఒక దేశమైతే.. జనాభా పరంగా ప్రపంచలోనే 11వ అతిపెద్ద దేశమవుతోందన్నారు. జనాభాపరంగా బిహార్ దేశాన్ని దాటేసిందన్నారు. అయితే, ప్రత్యక్షమైన పాలనా ఫలితాలను సాధించడానికి సమయం, నిరంతర కృషి అవసరమని అంగీకరించారు.

పాఠశాల విద్యకే తొలి ప్రాధాన్యత

2025లో జన్ సూరాజ్ ప్రభుత్వాన్ని ఏర్పడితే.. తమ తొలి ప్రాధాన్యత పాఠశాల విద్యను మెరుగుపరచడం అని అన్నారు. బిహార్ అభివృద్ధిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయాలని సూచించారు. ఆ నియమం వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందన్నారు. బిహారీ ప్రవాసులను చర్చలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి చురుకుగా మద్దతు ఇవ్వాలని కోరారు. ఉపఎన్నికల్లో తమపార్టీ పేలవమైన ప్రదర్శన కనబర్చినప్పటికీ.. పార్టీ భవిష్యత్ పై ఆశాజనకంగానే ఉన్నాని చెప్పారు."2025లో జన్ సూరాజ్ గెలుస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. నాకున్న అవగాహన ఆధారంగా, మా పార్టీ గెలుస్తుందని చెప్పగలను" అని ఆయన అన్నారు. 2029-2030 నాటికి బిహార్‌ను మధ్య-ఆదాయ రాష్ట్రంగా మార్చడం ఒక ముఖ్యమైన సవాలు అని తెలిపారు. స్థిరమైన కృషి, అంకితభావంతో ఏదైనా సాధించగలమన్నారు.

Tags:    

Similar News