బెయిల్ ఆర్డర్ అప్‌లోడ్ కాకముందే, ఈడీ స్టే కోసం వెళ్లింది: సునీతా కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి భార్య సునీతా కేజ్రీవాల్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టు వెబ్‌సైట్‌లో బెయిల్ ఆర్డర్ అప్‌లోడ్ కాకముందే ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌ను సవాల్ చేస్తూ స్టే కోసం హైకోర్టుకు వెళ్లారని అన్నారు.

Update: 2024-06-21 09:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి భార్య సునీతా కేజ్రీవాల్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టు వెబ్‌సైట్‌లో బెయిల్ ఆర్డర్ అప్‌లోడ్ కాకముందే ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌ను సవాల్ చేస్తూ స్టే కోసం హైకోర్టుకు వెళ్లారని అన్నారు. దేశంలో నియంతృత్వం అన్ని హద్దులు దాటి పోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రిని కేంద్ర సంస్థలు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా చూస్తున్నాయని పేర్కొంది. అయితే ఇంకా హైకోర్టు ఉత్తర్వులు రావాల్సి ఉంది. కోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు.

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై జైలులో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు రూ.లక్ష వ్యక్తిగత పూచికత్తుతో గురువారం సాయంత్రం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా, ఈడీ కేజ్రీవాల్ బెయిల్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన విడుదల అయితే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఈడీ వాదించగా, క్రింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను అమలుచేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే, ఢిల్లీ మంత్రి అతిషి శుక్రవారం దేశ రాజధానిలో నీటి సమస్య పరిష్కారానికి నిరాహార దీక్ష చేపట్టారు. హర్యానా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఢిల్లీకి సరిపడా నీటిని అందించడం లేదని ఆమె ఆరోపించారు. హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను ఇచ్చే వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందని అతిషి చెప్పారు. దీక్ష ప్రారంభించే ముందు, మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు మంత్రి అతిషి రాజ్‌ఘాట్ చేరుకున్నారు. ఆమె వెంట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్ ఉన్నారు.


Similar News