మూడు సముద్రాలు కలిసే చోట 75 అడుగుల మువ్వన్నెల జెండా
సముద్రాల సంగమాన్ని సూచించే చోట మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. Army unfurls 75-feet tricolor Indian national flag.
దిశ, వెబ్‌డెస్క్ః భారతదేశ 75వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించుకుంటున్న 'అజాది కా అమృత్ మహోత్సవ్' దేశవ్యాప్తంగా ఉత్తేజాన్ని నింపింది. ఈ క్రమంలోనే భారత సైన్యం గురువారం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిచెందిన ప్రదేశంలో 75 అడుగుల పొడవైన జాతీయ జెండాను ఆవిష్కరించింది. భారతదేశ దక్షిణ కొన, కన్యాకుమారి తీరంలోని వివేకానంద శిల స్మారక చిహ్నం వద్ద హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల సంగమాన్ని సూచించే చోట ఈ భారీ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. తిరువనంతపురంలోని పాంగోడ్ మిలిటరీ స్టేషన్‌లోని ఉభయచర యోధులు ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇక, ఈ సందర్భంగా నిర్వహించిన యాత్రలో భాగంగా తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కేరళలోని తిరువనంతపురం వరకు 75 కిలోమీటర్ల మేర జాతీయ జెండాలు పట్టుకుని 75 మంది సైనికులు కాలినడకన వెళ్లనున్నారు.
#IndianArmy unfurls 75-feet #Tiranga at #vivekananda rock #KanyaKumari #Tamilnadu , which marks the confluence of #indian ocean,Bay of Bengal &Arabian Sea
— Sidharth.M.P (@sdhrthmp) August 11, 2022
A military band played Saare Jahan as Accha , martial arts team performed Kalari payattu #IndiaAt75 #IndependenceDay2022 pic.twitter.com/Q0USsPFqGj