China: ప్రధాని మోడీ వ్యాఖ్యలు సంతోషకరం.. ఇరు దేశాల సంబంధాలపై చైనా ప్రశంసలు
భారత్ చైనా సంబంధాలపై మోడీ చేసిన వ్యాఖ్యలను చైనా ప్రశంసించింది. ఇరు దేశాల సహకారం పరస్పర విజయానికి దోహదపడుతుందని పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ చైనా సంబంధాలపై ప్రధాని మోడీ (Pm modi) చేసిన సానుకూల వ్యాఖ్యలను చైనా ప్రశంసించింది. ఇరు దేశాల మధ్య సహకారం పరస్పర విజయానికి దోహదపడుతుందని పేర్కొంది. ‘భారత్-చైనా సంబంధాలపై మోడీ చేసిన ప్రకటనను చైనా గమనించింది. దీనిని చైనా అభినందిస్తోంది’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. సోమవారం ఆమె బీజింగ్‌లో మీడియాతో మాట్లాడారు. గతేడాది అక్టోబర్‌లో రష్యాలోని కజాన్ నగరంలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య విజయవంతమైన సమావేశం జరిగిందని, ఇది ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, అభివృద్ధికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించిందన్నారు. రెండు దేశాలు ఉమ్మడి ఒప్పందాలకు కట్టుబడి పని చేస్తున్నాయని, తద్వారా సానుకూల ఫలితాలు వస్తున్నాయని వివరించారు. రెండు దేశాల మధ్య 2,000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన స్నేహపూర్వక సంబంధాలున్నాయని నొక్కి చెప్పారు.
రెండు దేశాలు ఒకదాని నుండి ఒకటి నేర్చుకున్నాయని, మానవాళి నాగరికత విజయాలకు ఎంతో దోహదపడ్డాయని కొనియాడారు. చైనా, భారత్‌లు ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు అని, వాటి డెవలప్‌మెంట్‌ను వేగవంతం చేయడానికి ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయని ఆకాంక్షించారు. ఇరు దేశాల సహకారంతో 2.8 మిలియన్ల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. గ్లోబల్ సౌత్, ప్రపంచ శాంతికి అనుకూలంగా పెరుగుతున్న చారిత్రక ధోరణిని అనుసరిస్తుందన్నారు.
కాగా, తాగాజా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత్, చైనాల మధ్య విభేదాలు సహజమే కానీ బలమైన సహకారం రెండు దేశాల ప్రయోజనాలకు, ప్రపంచ స్థిరత్వానికి కూడా ఎంతో దోహదపడుతుందని అని తెలిపారు. ఇరు దేశాలు ఎల్లప్పుడూ పోటీ పడాలని కానీ అది సంఘర్షణగా మారకూడదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశం తర్వాత సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, భవిష్యత్ లోనూ ఇది ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే చైనా స్పందించింది.
Read More..
Trump: రేపు పుతిన్‌తో మాట్లాడనున్న ట్రంప్.. కాల్పుల విరమణపై డిస్కస్ చేసే చాన్స్!