Supriya Sule: ఎయిరిండియాపై సుప్రియా సూలే ఆగ్రహం.. ఎందుకంటే?
దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) సేవల ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే(Supriya Sule) విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) సేవల ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే(Supriya Sule) విమర్శలు గుప్పించారు. ఎయిరిండియా విమానాలు సమయానికి (Flight Delay) రావట్లేదని.. తాను గంటలకుపైగా వేచి ఉండాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘ఎయిరిండియా విమానాలు ఎప్పుడూ ఆలస్యం అవుతున్నాయి. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మేం ప్రీమియం ఛార్జీలు చెల్లించి విమానాలు సమయానికి రావు. ఆలస్యం అవడం వల్ల పిల్లలు, సీనియర్ సిటిజన్స్, నిపుణులు ఇలా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను ఎయిరిండియా సంస్థకు చెందిన AI0508 విమానంలో ప్రయాణించా. దీని కోసం గంట 19 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చింది. ఇలాంటి జాప్యాలు పునరావృతం కాకుండా ఆయా సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి. విమానయాన సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరించేలా కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలి’ అని ఆమె ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఎయిరిండియాపై ఆరోపణలు
మరోవైపు, విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించినందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Chouhan) గత నెల ఎయిరిండియాపై మండిపడ్డారు. ప్రయాణికుల నుంచి పూర్తిఛార్జీలను వసూలు చేసి వారికి విరిగిపోయిన సీట్లను కేటాయించడాన్ని అనైతిక చర్యగా ఆయన అభివర్ణించారు. విమాన ప్రయాణంలో తనకు ఎదురైన ఛేదు అనుభవాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దీనికి వెంటనే ఎయిరిండియా స్పందించి మంత్రికి క్షమాపణలు చెప్పింది. ఇక ఆ తర్వాత బీజేపీ నేత జైవీర్ షెర్గిల్ సైతం ఎయిరిండియా సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిరిండియాకు ‘చెత్త ఎయిర్‌లైన్స్’ (WORST AIRLINES) విభాగంలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు. సంస్థ అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని వ్యాఖ్యానించారు.