Araku Coffee Stall : పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ కు ఆమోదం

ఇటీవలే అరకు కాఫీ(Araku Coffee) ప్రపంచ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

Update: 2025-03-17 17:04 GMT
Araku Coffee Stall : పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ కు ఆమోదం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవలే అరకు కాఫీ(Araku Coffee) ప్రపంచ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అరకు కాఫీ ప్రపంచంలోనే 2వ(World 2nd) అత్యుత్తమ స్థానాన్ని పొందింది. అయితే అరకు కాఫీకి దేశవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ మేరకు పార్లమెంటు(Parliament)లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరగా.. లోక్ సభ సచివాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంసద్ భవన్లో సంగం వద్ద, నలంద లైబ్రరీ వద్ద అరకు కాఫీ స్టాల్స్ ను పార్లమెంటు సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోమని తెలిపింది. ఈ మేరకు విజయనగరం ఎంపీ అప్పలనాయుడు(MP Appala Naidu)కు లోక సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ కుమార్ సాహు లేఖ రాశారు. ఈ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు గతవారం స్పీకర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఏపీలోని అరకు వ్యాలీలో పండే కాఫీ గురించి ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Tags:    

Similar News