అజిత్‌‌ పవార్‌ చేరికపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి(ఎన్సీపీ) షాక్ తగిలింది.

Update: 2024-07-17 18:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి(ఎన్సీపీ) షాక్ తగిలింది. పింప్రీ చించ్వాడ్‌లో అజిత్‌పవార్ వర్గానికి చెందిన నలుగురు కీలక నేతలు అజిత్ గవానే( పింప్రి-చించ్వాడ్ యూనిట్ చీఫ్), యశ్ సానే( పింప్రీ చించ్వాడ్ స్టూడెంట్స్ వింగ్ చీఫ్), మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే, పంకజ్ భలేకర్ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో స్పందిస్తూ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ తమ పార్టీలో స్థానం ఉంటుందన్నారు. అజిత్‌ పవార్‌ను తమ వర్గంలో చేర్చుకునే విషయం తన చేతిలో లేదని ఆయన పేర్కొన్నారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకునే విషయంలో తాను సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి వీలుండదని శరద్ పవార్ చెప్పారు. అజిత్ పవార్ వర్గం కీలక నేత ఛగన్ భుజ్‌బల్‌ ఇంటికి వచ్చి తనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారన్నారు. మరాఠా రిజర్వేషన్ల అంశంపై తనతో ఛగన్ భుజ్ బల్ చర్చించినట్లు వెల్లడించారు.


Similar News