‘ఇండియా’కు కేజ్రీవాల్‌ షాక్‌.. అక్కడ పోటీ చేస్తామని ప్రకటన

కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పార్టీ ‘ఆప్’ షాక్ ఇచ్చింది.

Update: 2023-08-27 16:48 GMT

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పార్టీ ‘ఆప్’ షాక్ ఇచ్చింది. బీహర్‌ అసెంబ్లీ పోల్స్‌లో తాము పోటీ చేస్తామని ఆప్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ ప్రకటించారు. డర్టీ పాలిటిక్స్ జరుగుతుండటం వల్లే బీహార్ అభివృద్ధి చెందడంలేదని ఆరోపించారు. బీహార్‌లో ఆప్‌ను బలోపేతం చేస్తామన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని విస్తరించాలని ఆ రాష్ట్ర నాయకులకు సూచించారు. ఇటీవల ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో బీహార్ రాష్ట్ర పార్టీ శాఖ సమావేశం జరిగిందని వెల్లడించారు.

ఈ పరిణామంపై బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ, ఆర్జేడీ స్పందించాయి. ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తామన్న ఆప్‌ ప్రకటనను తప్పుపట్టాయి.‘ఇండియా’ కూటమిలోని విధి విధానాలకు కట్టుబడి ఉండాలని ఆప్‌కు సూచించాయి. ‘ఇండియా’ కూటమి మీటింగ్ కోసం కేజ్రీవాల్‌ను పాట్నాకు ఆహ్వానించిన వాళ్లకే (సీఎం నితీశ్ కుమార్) ఇకపై ఇబ్బందులు ఉంటాయని బీజేపీ నేత షహన్వాజ్ హుస్సేన్ కామెంట్ చేశారు.


Similar News