46 రైళ్లలో 92 అదనపు జనరల్ బోగీలు

దిశ, నేషనల్ బ్యూరో: ప్యాసింజర్ రైళ్లలో బోగీల సంఖ్య తక్కువగా ఉండటంతో సామాన్య ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.

Update: 2024-07-12 19:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్యాసింజర్ రైళ్లలో బోగీల సంఖ్య తక్కువగా ఉండటంతో సామాన్య ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. దీనిపై ఎన్నికల సమయంలో విపక్షాలు గళమెత్తాయి. సామాన్య ప్రయాణికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించాయి. ఈనేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 46 ముఖ్య రైళ్లలో 92 అదనపు జనరల్ బోగీలను జోడించింది. త్వరలోనే మరో 22 రైళ్లలోనూ అదనపు బోగీలను అందుబాటులోకి తెస్తామని రైల్వేశాఖ అంటోంది. 2024-25 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంకల్లా మరో 10వేల నాన్ ఏసీ కోచ్‌ల తయారీకి ప్రణాళికలను రూపొందించినట్లు రైల్వేశాఖ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. వీటిలో 4,485 నాన్ ఏసీ కోచ్‌లను 2024-25లో.. మరో 5,444 నాన్ ఏసీ కోచ్‌లను 2025-26లో ఉత్పత్తి చేస్తామని వెల్లడించింది.


Similar News