బ్యాంక్ కస్టమర్లకు షాక్.. ఫేక్ మెసేజ్ లింకులతో మోసపోయిన వినియోగదారులు

మహారాష్ట్ర ముంబై‌లో ఓ ప్రైవేట్ బ్యాంక్ కస్టమర్లకు షాక్ తగిలింది.

Update: 2023-03-05 12:27 GMT

ముంబై: మహారాష్ట్ర ముంబై‌లో ఓ ప్రైవేట్ బ్యాంక్ కస్టమర్లకు షాక్ తగిలింది.కేవైసీ, పాన్ వివరాలు ఇవ్వాలని కోరుతూ వచ్చిన నకిలీ మెసేజ్ లింక్ ఓపెన్ చేయడం తో మూడు రోజుల వ్యవధిలో 40 మందికి పైగా కస్టమర్లు లక్షల రూపాయాలు కోల్పోయారు. లింక్‌లు ఓపెన్ చేసి బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీలు ఎంటర్ చేసేలా చేయడం ద్వారా మోసపోయినట్లు చెప్పారు.

తాజాగా బ్యాంక్‌లు కేవైసీని తప్పనిసరి చేయడంతో కస్టమర్లు మోసపోయినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేశారు. వినియోగదారులకు ఫోన్ చేసి ఎలాంటి వివరాలను బ్యాంక్‌లు అడగవని ప్రకటనలో తెలిపారు. ఎలాంటి లింకులు వచ్చిన ఓపెన్ చేసి మోసపోవద్దని చెప్పారు. బాధితుల్లో టీవీ యాక్టర్ శ్వేత మీనన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News