38 పార్టీలను ఏకం చేసిన ఘనత ఈడీదే : ఆప్

బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ నిప్పులు చెరిగింది.

Update: 2023-07-18 11:58 GMT

న్యూఢిల్లీ : బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ నిప్పులు చెరిగింది. ఎన్డీఏ కూటమిలోని 38 భాగస్వామ్య పార్టీలను కష్టపడి ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కే దక్కుతుందని ఆప్ రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు అవినీతి కుంభకోణాల నుంచి బయటపడేందుకే కూటమిగా ఏర్పడ్డాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.

బీజేపీని ఓడించి, దేశాన్ని కాపాడటం తప్ప మరో లక్ష్యం విపక్ష కూటమి ముందు లేదని స్పష్టం చేశారు. ఈమేరకు చద్దా మంగళవారం ట్వీట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతున్న విపక్ష కూటమి సమావేశానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆ పార్టీ ఇద్దరు ఎంపీలు హాజరయ్యారు.


Similar News