ప్రధాని మోడీ.. ‘ది టెర్మినేటర్’ పోస్ట్ వైరల్..

సోషల్ మీడియా ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది.

Update: 2023-08-30 13:38 GMT

న్యూఢిల్లీ : సోషల్ మీడియా ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. క్రియేటివ్ పోస్టులతో నెటిజన్స్ దృష్టిని ఆకట్టుకుంటోంది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్యార్జెనేగర్ నటించిన ‘ది టెర్మినేటర్’ సినిమా టైటిల్‌తో కమలదళం చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌కు విశేష స్పందన వస్తోంది. ‘ది టెర్మినేటర్’ టైటిల్, ప్రధాని మోడీ ఫోటో, ‘‘2024లో నేనే తిరిగొస్తా’’ అనే క్యాప్షన్‌తో అట్రాక్టివ్‌గా రూపొందించిన ఈ పోస్ట్‌ను బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో బుధవారం ఉదయం పోస్ట్ చేశారు. ‘‘ప్రతిపక్షాలు ప్రధాని మోడీని ఓడించొచ్చని భావిస్తున్నాయి.. మీరు కలలు కంటూనే ఉండండి.. టెర్మినేటర్ ఎల్లప్పుడూ గెలుస్తాడు’’ అని ఈ పోస్ట్‌పై కామెంట్ రాశారు. దీనికి ఇప్పటికే 4 వేలకుపైగా లైక్స్ వచ్చాయి.


Similar News