5 కిలోమీటర్ల లోతున భూకంపం.. భయంతో వణికిపోయిన జనం

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈరోజు (శనివారం) స్వల్పంగా భూకంపం సంభవించింది.

Update: 2024-10-12 12:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈరోజు (శనివారం) స్వల్పంగా భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 3:32కు సంభవించిన భూకంపం వల్ల కొద్ది సెకన్ల వరకు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇదిలా ఉంటే భూకంప కేంద్రం సిమ్లాలోని చిడ్గావ్ ప్రాంతంలో భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో ఉందని సిమ్లా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెట్ అథారిటీ తెలిపింది. 


Similar News