కరోనాతో యువ స్విమ్మర్ మృతి
దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారుడు అశుతోష్ ఐదు రోజుల క్రితం ఢిల్లీలోని లేడీ హార్డింగ్ ఆస్పత్రిలో మృతిచెందాడు. స్విమ్మర్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళనకు దిగడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ స్విమ్మింగ్ జట్టులో సభ్యుడైన అశుతోష్ ఈ నెల 10న అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు లేడీ హార్డింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఢిల్లీలోని అతని స్వగృహంలో […]
దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారుడు అశుతోష్ ఐదు రోజుల క్రితం ఢిల్లీలోని లేడీ హార్డింగ్ ఆస్పత్రిలో మృతిచెందాడు. స్విమ్మర్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళనకు దిగడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ స్విమ్మింగ్ జట్టులో సభ్యుడైన అశుతోష్ ఈ నెల 10న అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు లేడీ హార్డింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఢిల్లీలోని అతని స్వగృహంలో చికిత్స అందించినా ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రికి వెళ్లి రిపోర్టులు కావాలని అడిగితే వైద్యులు లేవని సమధానం ఇచ్చారు. వెంటనే అశుతోష్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లినా వైద్యులు పట్టించుకోలేదని, దీంతో అతడు అదేరోజు మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, శివాజీ స్టేడియంలో చిన్నారులకు ఆశుతోష్ స్విమ్మింగ్ శిక్షణ ఇస్తున్నాడు. అతనికి నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.