Malaysia Open : సెమీస్‌కు దూసుకెళ్లిన సాత్విక్ జోడీ
తాను రిట్మైర్మెంట్‌కు సిద్ధంగా లేనని.. అయితే మా నాన్న మాత్రం నేను టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నట్లు స్టార్ టెన్నిస్ ఆటగాడు జకోవిచ్ తెలిపాడు.
దిశ, స్పోర్ట్స్ : మలేసియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట పురుషుల డబుల్స్ టైటిల్ దిశగా వెళ్తున్నది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న టోర్నీలో సాత్విక్ జోడీ వరుసగా మూడో విజయాన్ని అందుకుని సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే, క్వార్టర్ ఫైనల్‌ను దాటడానికి సాత్విక్, చిరాగ్ శ్రమించాల్సి వచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత జంట 26-24, 21-15 తేడాతో మలేసియాకు చెందిన యూ సిన్ ఓంగ్-ఈ యి టియో ద్వయంపై పోరాడి గెలిచింది. 50నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో భారత షట్లర్లు.. మలేసియా ఆటగాళ్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. తొలి గేమ్‌లో పాయింట్ల కోసం నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డారు. అయితే, చివరికి తొలి గేమ్‌లో సాత్విక్ జోడీనే నెగ్గింది. ఆ తర్వాత రెండో గేమ్‌లో పుంజుకున్న ప్రత్యర్థులు పుంజుకున్నారు. చాలా సేపు ఆధిక్యంలో కొనసాగారు. ఈ క్రమంలోనే తిరిగి పుంజుకున్న భారత ప్లేయర్లు 11-11తో స్కోరును సమం చేశారు. విరామం అనంతరం మరింత దూకుడు పెంచడంతో రెండు గేముల్లోనే మ్యాచ్ కైవసమైంది. మలేసియా ఓపెన్ టోర్నీలో సాత్విక్, చిరాగ్ జోడీ వరుసగా మూడోసారి సెమీస్‌కు చేరుకుంది. 2023లో సెమీస్‌లో ఇంటిదారిపట్టగా.. గతేడాది ఫైనల్‌లో బోల్తా పడింది. శనివారం సెమీస్‌లో సౌత్ కొరియాకు చెందిన వాన్ హో కిమ్-సీయో సీయుంగ్ జే జోడీని ఎదుర్కోనుంది.