తప్పిదం జరిగింది.. ఇకపై ఇలాంటివి జరగనివ్వం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తొక్కిసలాట ఘటనపై బీఆర్ నాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు..
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede) ఘటన దురదృష్టకరమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని చెప్పారు. అంతేకాదు తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఆదేశించారన్నారు. తొక్కిసలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీర్ నాయుడు స్పష్టం చేశారు.
ఇక తొక్కిసలాట ఘటనలో ఎవరినీ ఉపేక్షించేది లేదని బీఆర్ నాయుడు హెచ్చరించారు. బాధితుల ఇళ్లకు శనివారం వెళ్లి చెక్‌లు అందిస్తామని ఆయన చెప్పారు. క్షమాపణ చెప్పడంలో తప్పులేదని, అంతమాత్రాన పోయిన ప్రాణాలు తిరిగిరావని తెలిపారు. తప్పిదం జరిగిందని, ఇకపై ఇలాంటివి జరగనివ్వమని పేర్కొన్నారు. టోకెన్ల జారీ కోసం చేసిన ఏర్పాట్లలో లోపం అయితే లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ సంవత్సరం తొమ్మిది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి ఆగమశాస్త్రాలు, పండితుల ప్రకారం నిర్ణయం ఉంటుందని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.