చౌక ధరలకు గంజాయి.. మైనర్ బాలుడు సైతం..

గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2025-01-10 13:46 GMT

దిశ,ఉప్పల్ : గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నాగపూర్ నుంచి చౌక ధరలకు గంజాయి కొనుగోలు చేసి ఉప్పల్ పరిసర ప్రాంతాలలోని పారిశ్రామిక వాడలో అవసరమైన వ్యక్తులకు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద గంజాయి విక్రయాలు జరుపుతున్నారన్న విశ్వసనీయమైన సమాచారంతో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు, ఉప్పల్ పోలీసులు సంయుక్తంగా నిఘా వేసి నలుగురు వ్యక్తులు షేక్ ఇమ్రాన్, ఠాకూర్ అజితేష్, శశికాంత్ తో పాటు మరో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2.2 కేజీల గంజాయిని, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితులను రిమాండ్ కి తరలించారు. మైనర్ బాలుడిని జువెనల్ హోమ్ కి తరలించామని ఎస్సై రఘురాం తెలిపారు.


Similar News