నిమజ్జనంలో అపశృతి.. నీటిలో పడిపోయిన జగిత్యాల చైర్‌పర్సన్

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. విగ్రహాలను స్థానిక చెరువులో నిమజ్జనం చేస్తుండగా తెప్ప ఒకవైపు వంగిపోవడంతో మునిసిపల్ ఛైర్‌పర్సన్ బోగ శ్రావణి జారినీటిలో పడిపోయారు. తెప్పపై ఉన్న మిగతా వారు వెంటనే ఆమెను పట్టుకోవడంతో క్షేమంగా బయటపడ్డారు. వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేసేందుకు చింతకుంట చెరువులోకి తెప్పపై వెళ్లారు. ఈ సమయంలో తెప్ప ఒకవైపు ఒరగడంతో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణితో పాటు మరో ముగ్గురు […]

Update: 2021-09-19 04:20 GMT

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. విగ్రహాలను స్థానిక చెరువులో నిమజ్జనం చేస్తుండగా తెప్ప ఒకవైపు వంగిపోవడంతో మునిసిపల్ ఛైర్‌పర్సన్ బోగ శ్రావణి జారినీటిలో పడిపోయారు. తెప్పపై ఉన్న మిగతా వారు వెంటనే ఆమెను పట్టుకోవడంతో క్షేమంగా బయటపడ్డారు. వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేసేందుకు చింతకుంట చెరువులోకి తెప్పపై వెళ్లారు. ఈ సమయంలో తెప్ప ఒకవైపు ఒరగడంతో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణితో పాటు మరో ముగ్గురు కూడా పడిపోయారు.

తెప్పపై ఉన్న మిగతా వారు ప్రమాదంలో పడిన వారిని కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. జగిత్యాల పట్టణానికి తాగు నీటిని అందించే ఈ చెరువులో భారీగా నీరు ఉన్న విషయాన్నిగమనించి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెప్పపై బరువు అంత ఒకే వైపున ఉంచడంతో వంగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఏదిఏమైనా నిమజ్జనం సమయంలో జరిగిన ఈ అపశృతిలో విషాదం చోటు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News