టీఆర్ఎస్ మంత్రులతో ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక పూజలు
దిశ, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్‌లు, కుసుమ జగదీశ్వర్, గండ్ర జ్యోతిలతో కలిసి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. […]
దిశ, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్‌లు, కుసుమ జగదీశ్వర్, గండ్ర జ్యోతిలతో కలిసి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరంగా ఉందన్నారు. యునెస్కో గుర్తింపునకు 40 యేండ్ల నుండి కృషి చేసిన పాండు రంగారావు, కవులు, కళాకారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, జిల్లా అధికార యంత్రంగానికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండగగా గుర్తించాలని కోరారు.