పోస్ట్ కొవిడ్ రికవరీకి ‘కడక్‌నాథ్ థెరపీ’

దిశ, ఫీచర్స్ : కొవిడ్ సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల నుంచి దేశం బయటపడినా.. వైరస్‌బారిన పడి కోలుకున్న వ్యక్తులను సైడ్ ఎఫెక్ట్స్ వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో బాధితులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడగా.. ఫుడ్ విషయంలో కొన్ని ప్రికాషన్స్ సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్లు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌, జబువాలోని కృషి విజ్ఞాన్ కేంద్ర.. పోస్ట్ కొవిడ్-19 కాంప్లికేషన్స్ నుంచి రికవరీ అయ్యేందుకు గాను రాష్ట్రంలోని బ్లాక్-ఫీదర్డ్ పౌల్ట్రీ బీడ్‌కు […]

Update: 2021-07-11 02:58 GMT

దిశ, ఫీచర్స్ : కొవిడ్ సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల నుంచి దేశం బయటపడినా.. వైరస్‌బారిన పడి కోలుకున్న వ్యక్తులను సైడ్ ఎఫెక్ట్స్ వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో బాధితులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడగా.. ఫుడ్ విషయంలో కొన్ని ప్రికాషన్స్ సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్లు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌, జబువాలోని కృషి విజ్ఞాన్ కేంద్ర.. పోస్ట్ కొవిడ్-19 కాంప్లికేషన్స్ నుంచి రికవరీ అయ్యేందుకు గాను రాష్ట్రంలోని బ్లాక్-ఫీదర్డ్ పౌల్ట్రీ బీడ్‌కు చెందిన ‘కడక్‌నాథ్’ థెరపీని సూచించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)ను కోరింది.

ఈ విషయంపై కృషి విజ్ఞాన్ కేంద్ర సీనియర్ సైంటిస్ట్.. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌కు లెటర్‌ రాశారు. కడక్‌నాథ్(బ్లాక్ చికెన్‌లో అరుదైన బ్రీడ్) కోళ్ల మాంసం, గుడ్లు, సూప్‌.. పోస్ట్ కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకునేందుకు అవసరమైన పోషకాలను అందించగలవని లెటర్‌లో పేర్కొన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో న్యూట్రిషనల్ థెరపీ కీలకంగా మారిందనే విషయం అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఇమ్యూన్ సిస్టమ్‌ను పటిష్టపరచడంతో పాటు ఆహార సమతుల్యతను అందించడంలో కడక్‌నాథ్ మాంసం కీలక పాత్ర పోషించగలదు’ అని తెలిపారు.

ఇక కడక్‌నాథ్ ఆహార ఉత్పత్తుల్లో వ్యాధి లక్షణాలను పూర్తిగా తగ్గించడంతో పాటు ఇమ్యూన్ సిస్టమ్ పనితీరును మెరుగుపరిచే ‘PUFA(EPA), DHA(22:6), జింక్, ఐరన్ విటమిన్-సీ, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, ఇతర విటమిన్లు ఉంటాయని తెలిపిన కృషి విజ్ఞాన కేంద్రం.. నేషనల్ మీట్ రీసెర్చ్ సెంటర్ (NMRC, హైదరాబాద్) వారు కడక్‌నాథ్ మాంసంలోని పోషక విలువలపై రీసెర్చ్ చేసిన సమాచారాన్ని కూడా లెటర్‌ ద్వారా తెలియజేసింది. కాగా ఈ కడక్‌నాథ్ కోళ్లను మధ్యప్రదేశ్‌లోని జబువా ప్రాంతానికి చెందిన ట్రైబల్ కమ్యూనిటీస్ ఎక్కువగా పెంచుతుంటారు.

Tags:    

Similar News