‘అయ్యా, నిమ్మగడ్డ గారూ.. ఇప్పుడేం చేస్తారో చెప్పండి ప్లీజ్’

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ షెడ్యూల్ ఇచ్చిన విషయంపై.. జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని, ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని, అందువల్లే ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కమార్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యులు […]

Update: 2021-01-11 06:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ షెడ్యూల్ ఇచ్చిన విషయంపై.. జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని, ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని, అందువల్లే ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కమార్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘అయ్యా, నిమ్మగడ్డ గారూ.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతారా లేక చంద్రబాబు ఇంటికి వెళతారా..? చెప్పండి ప్లీజ్..!’’ అంటూ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News