బండి సంజయ్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రజాస్వామ్య తెలంగాణ పేరిట పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలుత హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాష్ట్రంలో గడీల పాలనకు వ్యతిరేకంగా 55 రోజులు, 750 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. రోజుకు 15 నుంచి 20 కిమీ మేర పాదయాత్ర కొనసాగనుంది. […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రజాస్వామ్య తెలంగాణ పేరిట పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలుత హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాష్ట్రంలో గడీల పాలనకు వ్యతిరేకంగా 55 రోజులు, 750 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు.
రోజుకు 15 నుంచి 20 కిమీ మేర పాదయాత్ర కొనసాగనుంది. ఆక్టోబర్ 2 వరకు మొదటి విడత పాదయాత్ర చేయనుండగా.. మొత్తం 4 విడతలుగా తెలంగాణ అంతటా పాదయాత్ర ఉంటుందని ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మిగతా పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.