కరోనా టెస్టుల తగ్గింపునకు కారణమేంటి?: ఎంపీ బండి సంజయ్
దిశ, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులు తగ్గించడానికి కారణాలేమిటో తెలుపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ డిమాండు చేశారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులకు సంబంధించి ఏవైనా అవకతకవలు జరిగి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అవినీతికి సంబంధించి ఆధారాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కరీంనగర్ జిల్లా చింతకుంటలో ఈదురు గాలులకు దెబ్బతిన్న మామిడి తోటలను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ, టీఆర్‌ఎస్ ఒక్కటా కాదా […]
దిశ, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులు తగ్గించడానికి కారణాలేమిటో తెలుపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ డిమాండు చేశారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులకు సంబంధించి ఏవైనా అవకతకవలు జరిగి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అవినీతికి సంబంధించి ఆధారాలు ఇస్తే
కేంద్ర ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కరీంనగర్ జిల్లా చింతకుంటలో ఈదురు గాలులకు దెబ్బతిన్న మామిడి తోటలను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ, టీఆర్‌ఎస్ ఒక్కటా కాదా అనే విషయం ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. కరోనా విషయంలో అంతా కలిసి ఎలాగైతే పొరాడమో.. రైతుల విషయంలో కూడా అధికార ప్రతిపక్షాలు కలిసి పని చేయాల్సిన అవశ్యకత ఉందని తెలిపారు. ధాన్యం తరుగు విషయంలో రైతులు మోసపోతున్నారని విమర్శించారు. రైతుల విషయంలో కేంద్రం పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటుందని ఆరోపించారు.
Tags: BJP state state president,MP Bandi Sanjay, Inspect, Damaged, mango plantations