ముద్దు పెడుతూ హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ శ్రీజ పోస్ట్.. ఎవరి కోసమో తెలుసా?
మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె మొదట ఓ అబ్బాయిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓ కూతురు పుట్టాక అతనికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత కల్యాణ్ దేవ్‌కి ఇచ్చి చిరంజీవి పెళ్లి చేశారు. అయితే వీరిద్దరికి కూడా ఓ కూతురు పుట్టింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం ఇద్దరు వేరుగా ఉంటున్నారు. పిల్లలతో శ్రీజ చిరంజీవి వాళ్ళ ఇంట్లో ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంది. తాజాగా, తన ఫ్రెండ్ రచనకు బర్త్ డే విషెస్ తెలిపింది. ‘‘హ్యాపీ బర్త్ డే మై లవ్ రచన పాలకుర్తి’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా ఆమెకు ముద్దు పెడుతూ ఉన్న ఫొటో కూడా షేర్ చేసింది. ప్రస్తుతం శ్రీజ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.