ఫైనల్‌గా గుడ్ న్యూస్ చెప్పబోతున్న ప్రభాస్- అనుష్క..! ముహూర్తం కూడా ఫిక్స్..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మిర్చి, బాహుబలి 1,2 సినిమాల్లో జంటగా నటించిన వీరు తన నటనతో ఆకట్టుకుంటున్నారు. వెండి తెరపై హిట్ పెయిర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆన్ స్క్రీన్‌లో వీరి కెమిస్ట్రీని చూసిన ప్రేక్షకులు వీరు ఆఫ్ స్క్రీన్ కూడా లవర్స్ అనుకున్నారు. అలాగే మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారని ఇప్పటికీ పలు పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. అందులో సందీప్ వంగ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ ఒకటి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుంది. అలాగే ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకు వెళుతున్నట్లు సమాచారం. అయితే చాలా రోజుల నుండి ప్రభాస్‌కి జోడిగా ఏ హీరోయిన్‌ని సెట్ చేయాలా అని తెగ వెతికేస్తున్న సందీప్ వంగాకి ఫైనల్‌గా హీరోయిన్ దొరికేసిందట. ఇంతకీ ఆమె మరెవరో కాదండోయ్ మన అనుష్క శెట్టినే. ఏంటి నిజమా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక డార్లింగ్‌కి జోడిగా అనుష్క అయితే పర్‌ఫెక్ట్‌గా మ్యచ్ అవుతుందని సందీప్ వంగా ఫిక్స్ అయ్యారట. దీంతో ఓ మంచి ముహూర్తం పెట్టి పూజా కార్యక్రమాలతో సినిమా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదే స్టార్ట్ కానున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్, అనుష్క ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.