ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలో ఆ స్టార్స్..? వైరల్ అవుతున్న న్యూస్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ‘దేవర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ‘దేవర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఓ మూవీలో నటిస్తున్నాడు. ‘ఎన్టీఆర్-31’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించి ఆకట్టుకోనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కావడంతో పాటు పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కానీ ఇందులో ఎవరెవరు నటిస్తున్నారో, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత కర్ణాటకలో స్టార్ట్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీలో మలయాళ స్టార్లు టోవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మూవీ టీమ్ నుంచి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.