ఓటీటీలోకి రాబోతున్న ‘బచ్చల మల్లి’.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఒకప్పుడు కామెడీ సినిమాలతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) రూట్ మార్చాడు.
దిశ, సినిమా: ఒకప్పుడు కామెడీ సినిమాలతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) రూట్ మార్చాడు. గత కొద్ది రోజుల నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’(Bachchala Malli). సుబ్బ మంగాదేవి తెరకెక్కించిన ఈ సినిమాలో హనుమాన్ బ్యూటీ అమృతా అయ్యర్(Amritha Aiyer) హీరోయిన్‌గా నటించింది.
అయితే ఈ మూవీ డిసెంబర్ 20 విడుదల పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ హిట్ అందుకోలేకపోయింది. తాజాగా, ‘బచ్చలమలల్లి’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఆనందపడుతున్నారు.