పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిచ్చే న్యూస్.. సంక్రాంతి ట్రీట్‌గా ఆ సినిమా గ్లింప్స్..?

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘ఓజీ’(ఓజాస్ గంభీరా).

Update: 2025-01-09 07:25 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘ఓజీ’(ఓజాస్ గంభీరా). డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఓజీ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని పవర్ స్టార్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది.

అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తదా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంక్రాంతి పండుగకి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓజీ టీమ్ కూడా పొంగల్ ట్రీట్ ఇచ్చేందుకు ఓ గ్లింప్స్‌ను విడుద‌ల చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే గ్లింప్స్‌కు సంబంధించిన వ‌ర్క్ పూరైనట్లు సమాచారం. ఇక ఈ గ్లింప్స్ నిడివి 1.39 నిమిషాలు ఉన్న‌ట్లు టాక్‌.

అయితే ఈ ఓజీ గ్లింప్స్‌ను సంక్రాంతి కానుక‌గా విడుద‌ల అవుతున్న చిత్రాలతో క‌లిసి థియేట‌ర్ల‌లో వేయ‌బోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది. ఇక ఈ వార్త విన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు.

Tags:    

Similar News