Rashmika Mandanna: రష్మిక మందన్నకు గాయం.. ఆందోళన చెందుతున్న అభిమానులు?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. భాషతో సంబంధం లేకుండా ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఇటీవల ఈ అమ్మడు ఐకాన్ అల్లు అర్జున్(Allu Arjun) సరసన ‘పుష్ప-2’(Pushpa 2: The Rule)లో నటించింది.
ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ పలు రికార్డులు బద్దలు కొడుతూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. రష్మిక మందన్న ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే సోషల్ మీడియా(Social Media)లో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. కుబేర, ది గర్ల్ ఫ్రెండ్(Girlfriend), సికందర్(Sikander) వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, రష్మిక గాయపడినట్లు సోషల్ మీడియా(Social Media)లో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడినట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సికందర్ షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతుండగా.. ఇలా అవడంతో అంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. దీనిపై రష్మిక స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.