ఏంటి.. ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు ఆ స్టార్ హీరోవా..? భరణంగా అంత మొత్తం చెల్లించాడా..!
ప్రస్తుతం కాలంలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి ఫ్యాషన్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యాక హ్యాపీగా కలిసి ఉండి కొన్నాళ్లకే చిన్న చిన్న మనస్పర్థలతో విడాకులు తీసుకొని విడిపోయే వారు కొంత మంది ఉంటే.. పిల్లలు పుట్టి పెద్దగా అయ్యాక డివోర్స్ తీసుకునే వాళ్ళు మరికొంత మంది.
దిశ, సినిమా: ప్రస్తుతం కాలంలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి ఫ్యాషన్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యాక హ్యాపీగా కలిసి ఉండి కొన్నాళ్లకే చిన్న చిన్న మనస్పర్థలతో విడాకులు తీసుకొని విడిపోయే వారు కొంత మంది ఉంటే.. పిల్లలు పుట్టి పెద్దగా అయ్యాక డివోర్స్ తీసుకునే వాళ్ళు మరికొంత మంది. ఇక ఇండస్ట్రీలో మాత్రం విడాకులు అనేది ఫ్యాషన్ అనే చెప్పుకోవాలి. మంచి పెయిర్ అనుకున్న జంటలు పుటుక్కున మేము విడిపోతున్నామంటూ షాక్ ఇస్తున్నారు. అయితే సహజంగా విడిపోయినప్పుడు భర్త.. భార్యకి భరణంగా ఎంతో కొంత డబ్బును ఇస్తారన్న సంగతి తెలిసిందే. హస్బెండ్ సంపాదిస్తున్న దాన్ని బట్టి, పిల్లలు ఉన్న దాన్ని బట్టి ఈ విలువ ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి ఇండస్ట్రీలోనే ఖరీదైన విడాకులు ఎవరివి..? ఏ హీరోవి..? భరణంగా ఎంత ఇచ్చాడో ఇప్పుడు మనం చూద్దాం.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఆయన మాజీ సతీమణి సుస్సానే ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట పెళ్లయిన 14 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. అప్పట్లో వీరిద్దరి డివోర్స్ గురించి పెద్ద చర్చే నడిచింది. అయితే విడాకుల టైం లో రూ. 400 కోట్ల భరణం ఇవ్వాలని సుస్సానే హృతిక్‌ను డిమాండ్ చేసిందట. కానీ, ఎన్నో ప్రయత్నాల తర్వాత రూ.380 కోట్లు చెల్లించేందుకు హృతిక్ అంగీకరించాడు. దీంతో ఇండస్ట్రీలోనే హృతిక్, సుస్సానే ఖాన్‌ల విడాకులు చాలా ఖరీదైనవిగా మారిపోయింది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.