ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం.. మారనున్న ఈ రాశుల వారి జాతకం!
శుభకృత్ నామ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 10న జరగబోతుంది. ఉదయం 7.05 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.29 గంటల వరకు గ్రహణం ఏర్పడుతుంది.
దిశ, వెబ్‌డెస్క్ : శుభకృత్ నామ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 10న జరగబోతుంది. ఉదయం 7.05 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.29 గంటల వరకు గ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారత్‌లో కనిపించనందున, ఇక్కడ చెల్లదు. అయితే సూర్య గ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తే, మరికొన్ని రాశుల వారి అశుభ ఫలితాలు కలగనున్నాయి.కాగా సూర్యగ్రహంణ వలన మూడు రాశుల వారి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
వృషభ రాశి : సూర్యగ్రహణం వలన ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. వృత్తి , వ్యాపారల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
మిథున రాశి : సూర్యగ్రహణం ఈ రాశి వారి జీవితం మారబోతుంది. వీరు కోల్పోయిన డబ్బును పొందేలా చేస్తుంది. చాలా కాలంగా ఎవరైతే సంతానం కావడం లేదని బాధపడుతున్నారో వారికి సంతానం అయ్యే అవకాశం ఉంది. ధనలాభం కలుగుతుంది.
ధనస్సు రాశి : ఈ రాశివారికి సూర్యగ్రహణం కారణంగా పట్టిందల్లా బంగారం కానుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.