‘కల్కి 2’ రిలీజ్‌పై క్రేజీ అప్‌డేట్.. వచ్చేది అప్పుడే అంటూ హింట్ ఇచ్చిన నిర్మాత!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది.

Update: 2024-06-29 14:10 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. విజయాల బాట పట్టింది. కలెక్షన్లలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ.. రెండు రోజుల్లో రూ. 298.5 కోట్లు వసూలు చేసింది. అలాగే మరో రెండు, మూడు రోజుల్లో రూ. 1000 కోట్లు రాబట్టడం ఖాయమని చెబుతున్నారు సినిమా విశ్లేషకులు. ఇక ‘కల్కి’ విజయపథంలో దూసుకుపోతున్న క్రమంలో ‘కల్కి 2’ పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు నిర్మాత అశ్వనీదత్.

‘‘కల్కి’లో నటించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకుణె, కమల్ హాసన్ తయ యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా నాగ్ అశ్విన్ విజువలైజేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. బుజ్జి కాన్సెప్ట్ మొత్తం ఆయనదే. ఇక ‘కల్కి’ కథా చర్చల్లో ఉన్నప్పుడే రెండు భాగాలుగా తీయాలని అనుకున్నాము. కల్కి పార్ట్-2 కి సంబంధించిన చిత్రీకరణ కొంతమేర కంప్లీట్ అయింది. కొన్ని ముఖ్య సన్నివేశాలు, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. దానికి మినిమమ్ సంవత్సరం అయినా పట్టొచ్చు. అందుకే కల్కి పార్ట్ 2 విడుదలపై ఇంకా ఎలాంటి డేట్ అనుకోలేదు. కానీ, దాదాపుగా వచ్చే ఏడాది ఇదే టైంలో విడుదల కావచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ నిర్మాత కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. 

Similar News