యూట్యూబర్‌తో హీరోయిన్ పెళ్లి ఫిక్స్..! వరుడి బ్యాక్‌గ్రౌండ్ తెలిసి షాక్‌లో నెటిజన్లు (పోస్ట్)

ఈ మధ్య కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటూ ఓ ఇంటివారు అయిపోతున్నారు.

Update: 2024-07-01 14:49 GMT

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటూ ఓ ఇంటివారు అయిపోతున్నారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి పూర్తిగా పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టేస్తున్నారు. అయితే కొందరు అధికారికంగా ప్రకటిస్తున్నారు. కానీ మరికొందరు ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయకుండా పెళ్లి చేసేసుకుంటూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ సునైనా కూడా పెళ్లి పీటలెక్కబోతుంది. ఇటీవల ఇన్‌స్టా వేదికగా ఓ అబ్బాయి చేతిని పట్టుకున్న ఫొటో షేర్ చేసి లాక్ క్యాప్షన్ జత చేసింది. కానీ తనకు కాబోయే వాడు ఎవరో చూపించలేదు.

అయితే ఈ అమ్మడు చేసుకోబోయేది మొదటి భార్యతో విడాకులు తీసుకున్న దుబాయ్ యూట్యూబర్ ఖలీద్ అల్ అమెరీతో అని పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయిపోయినట్లు జూన్ 26న ఖలీద్ ఓ పోస్ట్ పెట్టాడు. సునైనా, ఖలీద్ పోస్టుల ఆధారంగా ఈ జంట తొందరలో పెళ్లి చేసుకోబోతుందని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే సునైనా స్పందిస్తే కానీ క్లారిటీ రాదు. కాగా ఖలీద్‌కు ఇది వరకే సలామా మొహమ్మద్ అనే అమ్మాయితో పెళ్లి అయి.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడాకులు అయినట్లు సమాచారం.

Similar News