ప్రభాస్ ‘కల్కి’ సినిమా ఆరు రోజుల్లో ఎన్ని కోట్లు సాధించిందంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి కలెక్షన్లు భారీగా రాబడుతూ బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది.

Update: 2024-07-03 13:17 GMT

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి కలెక్షన్లు భారీగా రాబడుతూ బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా జూన్ 27న విడుదలైంది. సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతుంది. మొదటి రోజు రూ. 191.50 కోట్లు వసూల్ చేసింది.

ఆరు రోజుల్లో ఏకంగా రూ. 680 పైగానే వసూల్ చేసినట్లు సినీ వర్గాల టాక్. అయితే కల్కి కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టిస్తోంది. విడుదలై వారం కాకముందు రూ. 500 కోట్ల మార్క్‌ను టచ్ చేసిన సినిమాగా నిలిచినట్లు సమాచారం. అయితే తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, సలార్ మొదటి నాలుగు స్థానాలు దక్కించుకోగా ఐదవ ప్లేస్ కల్కికి వచ్చినట్లు తెలుస్తోంది.

Read More..

‘కల్కి’ సినిమాలో కృష్ణుడికి వాయిస్ ఓవర్ ఇవ్వడంపై.. ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేసిన అర్జున్ దాస్

Tags:    

Similar News