హీరోయిన్ రకుల్ కు అర్ధరాత్రి ఫోన్..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది త్వరగా సక్సెస్ అవుతుంటే మరికొంతమంది కాస్త టైం

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది త్వరగా సక్సెస్ అవుతుంటే మరికొంతమంది కాస్త టైం తీసుకుంటున్నారు. ఇక మరికొంతమంది.. ఇప్పటికే ఇండస్ట్రీలో సక్సెస్ అయి దూసుకు వెళ్తున్నారు. ఇలాంటి కోటాలోకి రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet సింగ్ ) వస్తారు. హీరోయిన్ రకుల్ ( Rakul ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు పది సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
అయితే అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ తన లైఫ్ లో జరిగిన కొన్ని సన్నివేశాలను తాజాగా.. వివరించారు. పూరి జగన్నాథ్ సినిమాను తాను రిజెక్ట్ చేశానని తాజాగా ప్రకటించారు రకుల్. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలను వదులుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించారు రకుల్. కాలేజీ లో చదువుకుంటున్న సమయంలో మోడలింగ్ చేసినట్లు గుర్తు చేశారు. కన్నడ పరిశ్రమలో తొలి ఆఫర్.. తనకు వచ్చిందని వివరించారు.
అది రిలీజ్ అయిన తర్వాత టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి కూడా... ఆఫర్ వచ్చిందని తెలిపారు. ఓ రోజు.. లేట్ నైట్ లో పూరి జగన్నాథ్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని స్పష్టం చేశారు రకుల్. 70 రోజులపాటు డేట్స్ కావాలని కూడా.. పూరి జగన్నాథ్ ( puri jagannadh) అడిగినట్లు తెలిపారు. తానప్పుడు కాలేజీలో ఉన్న నేపథ్యంలో నాలుగు రోజులు మాత్రమే వీలవుతుందని సమాధానం ఇచ్చానని... క్లారిటీ ఇచ్చారు. దాంతో ఆ సినిమా కూడా తన నుంచి వెళ్ళిపోయిందన్నారు. ఇదే తరహాలో చాలా హిట్ సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు రకుల్.
Read More..
Rakul Preet Singh: నమ్మి మోసపోవడమంతా భయంకరమైనది మరోటి లేదు.. షాకింగ్‌గా రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్