కొంటె చూపుతో చంపేస్తున్న అనసూయ.. అసూయపుడుతోందంటున్న ఫ్యాన్స్!

అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. తళుక్కుమనే అందం ఈ అమ్మడు సొంతం. జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ యాంకరింగ్, గ్లామర్‌తో అందరి మనసులు

Update: 2024-07-03 13:24 GMT

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. తళుక్కుమనే అందం ఈ అమ్మడు సొంతం. జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ యాంకరింగ్, గ్లామర్‌తో అందరి మనసులు దోచేసుకుంది. దీంతో అమ్మడుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా, సినిమాల్లో కూడా అవకాశాలు రావడంతో బుల్లి తెరకు గుడ్ బై చెప్పి, సినిమాల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది.

పుష్ప సినిమాలో అనసూయ తన నటనతో ఔరా అనిపించుకుంది. ఆమె యాక్టింగ్‌కు ఎంతో మంది ఫిదా అయిపోయారు. దీంతో ఈ బ్యూటీకి చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ, ఏ పాత్రలోనైనా సరే ఒదిగిపోయి తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం అనసూయ పుష్ఫ2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక అనసూయ గ్లామర్, తన అందం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుద్దీ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తన హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కసి కసిగా చూస్తూ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ,ట్రెండీ డ్రెస్‌లో కసిగా చూస్తూ కనిపించింది. ఇక ఈ ఫోటోలు చూసిన తన అభిమానులు, అనసూయ నీ అందం చూస్తే మాకే అసూయ పుడుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Similar News