చంద్రబాబు రాముడు, పవన్ కళ్యాణ్ లక్ష్మణుడు లేదా ఆయన కృష్ణుడు ఈయన అర్జునుడిగా..

మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరో మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం కూడా. ఒకప్పుడు నవ్విన జనంతోనే ఇప్పుడు జేజేలు చెప్పించుకుంటున్నారు.

Update: 2024-07-03 13:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరో మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం కూడా. ఒకప్పుడు నవ్విన జనంతోనే ఇప్పుడు జేజేలు చెప్పించుకుంటున్నారు. ఇటు హీరోగా.. అటు పొలిటికల్ లీడర్‌గా సక్సెస్ సాధించిన పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా సినీ రచయిత, నటుడు పరిచూరి గోపాలకృష్ణ మెగా హీరోపై తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. అంతేకాదు.. పవన్‌పై ఓ స్పెషల్ వీడియోను రూపొందించి తన యూట్యూబ్‌లో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇంతకూ ఆ వీడియోలో ఏముంది అంటే..?

‘‘పవన్ కళ్యాణ్ ఎదిగేకొద్దీ ఒదిగే వ్యక్తి. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తుంటే చూస్తూ అలాగే కూర్చుండిపోయా. పవన్ ఇంకా ఎత్తుకు ఎదగాలి. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమాల కోసం పది రోజులు కేటాయించేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు తీయడం కొనసాగించాలి. పవన్ కళ్యాణ్ నవ్వుకు చాలా లోతైన అర్థాలు ఉంటాయి. ఆయన సడెన్‌గా నవ్వితే దానికి ఓ పరమార్థం ఉంటుంది. పవన్‌ను అమితంగా అభిమానించే నేను ఇప్పటి వరకు ఆయన సినిమాలకు రచయితను కాలేకపోయాను. రాజకీయం పవన్‌కు సెట్ కాదు.. ఆయన స్పీచ్ అంతా సినిమా డైలాగులే అంటూ హేళన చేసిన వారిని సవాల్ చేస్తూ చరిత్ర సృష్టించారు. ఆయన కామెంట్స్ సినిమా రచయితల స్ర్రిఫ్ట్ కాదు.. పవన్ ప్రతి మాట ఎంతో ఆలోచనతో మాట్లాడినవి. వాటిల్లో ఓపికతో చేసిన వాగ్దానాలు ఉన్నాయి. వాటిని నిలబెట్టుకునే సమయంలో చంద్రబాబు రాముడిలా.. పవన్ లక్ష్మణుడిగా, బాబు కృష్ణుడిగా, కళ్యాణ్ అర్జునుడిగా ఉండాలి. ఇద్దరు కలిసి పని చేయాలి. అలాగే సినీ ఇండ్రస్ట్రీ నుంచి నాదో విన్నపం.. 24 క్రాఫ్ట్స్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌తో మాట్లాడి పరిశ్రమకు మంచి చేయాలని కోరుతున్నాను’’ అంటూ పరిచూరి గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.  

Read more...

‘పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నాను’..పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు! 


Similar News