అందరి చూపు భారతీయుడు 2 సెన్సార్ పైనే.. రన్ టైమ్ ఎంతంటే?

కోలీవుడ్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో స్టార్‌ హీరో కమల్‌హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'భారతీయుడు 2'.

Update: 2024-07-05 14:25 GMT

దిశ, సినిమా: కోలీవుడ్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో స్టార్‌ హీరో కమల్‌హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'భారతీయుడు 2'. ఈ చిత్రం 1996 బ్లాక్ బస్టర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ మూవీ ప్రమోషన్ కంటెంట్ భారీ అంచనాలను క్రియేట్ చేయడంతో మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 'భారతీయుడు 2' సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి కొన్ని పరిమితులతో U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా 3 గంటల 10 నిమిషాల రన్ టైమ్ ఉంది.

రెండు గంటల నిడివిగల సినిమా చూడటానికే ఒక్కోసారి ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇంత టైం ఉన్న మూవీ ప్రేక్షకులను మెప్పించాలంటే మంచి కథ, కాన్సెప్ట్ చాలా అవసరం. దీనిపై దర్శకుడు శంకర్ నమ్మకంగా ఉన్నాడు. భారతీయుడు 2 అద్భుతంగా ఉంటుందని చెబుతున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రం జూలై 12న థియేటర్లలోకి రానుంది. 


Similar News