Chinmayi: జానీ మాస్టర్‌ బెయిల్‌పై చిన్మయి సెన్సేషనల్ ట్వీట్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-04 13:30 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ కావడంతో ఈ ఘటన ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఓ లేడీ కొరియోగ్రాఫర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేయగా.. గోవాకు పారిపోయాడు. అయితే పోలీసులు అతన్ని పట్టుకుని కోర్ట్‌లో ప్రవేశపెట్టగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది.

కానీ ఆయన అక్టోబర్ 8న జాతీయ అవార్డును తీసుకునేందుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను కోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, జానీ మాస్టర్‌ బెయిల్‌తో బయటకు రావడంపై సింగర్ చిన్మయి X వేదికగా స్పందించింది. ‘‘మైనర్ మీద అత్యాచారం చేశానని తనంతట తనే ఒప్పుకున్న అతన్ని నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం బెయిల్‌పై బయటకు పంపారు. ఇది ఇండియాలోని పరిస్థితి’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ చిన్మయి ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.


Similar News