దసరా స్పెషల్‌.. ఆ సినిమా టికెట్‌ రూ.112 మాత్రమే (ట్వీట్)

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న మూవీస్‌లో ‘మత్తు వదలరా’ ఒకటి.

Update: 2024-10-04 14:32 GMT

దిశ, సినిమా: చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న మూవీస్‌లో ‘మత్తు వదలరా’ ఒకటి. ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’ వచ్చిన విషయం తెలిసిందే. రితేష్ రానా దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మత్తు వదలరా 2’ సెప్టెంబర్ 13న రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. దసరా పండుగ సంద్భంగా మత్తు వదలరా 2 టీమ్ ప్రేక్షకులకు ఓ భారీ ఆఫర్ ఇచ్చింది. అయితే మూవీ రిలీజై 4 వారాలు గడుస్తున్న ఇంకా సక్సెస్‌ఫుల్‌గా థియేటరలలో ఈ సినిమా రన్ అవుతుందనే విషయాన్ని తెలుపుతూ.. ‘హిలేరియస్ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ #MathuVadalara2ని రూ.112కే ఆస్వాదించండి. ఈ దసరా పండుగా స్పెషల్‌గా ఎంటర్‌టైన్ అవ్వండి’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

Click Here For Twitter Post..


Read More...

అలా అయితేనే ఎంకరేజ్ చెయ్యండి.. లేకుంటే వదిలేయండి.. నటుడు కామెంట్స్ వైరల్ 


Similar News