అలా అయితేనే ఎంకరేజ్ చెయ్యండి.. లేకుంటే వదిలేయండి.. నటుడు కామెంట్స్ వైరల్

సీనియర్ నటుడు అర్జున్ సర్జా మేనల్లుడు, కన్నడ నటుడు ధృవ స‌ర్జా నటిస్తున్న తాజా చిత్రం ‘మార్టిన్’.

Update: 2024-10-04 14:17 GMT

దిశ, సినిమా: సీనియర్ నటుడు అర్జున్ సర్జా మేనల్లుడు, కన్నడ నటుడు ధృవ స‌ర్జా నటిస్తున్న తాజా చిత్రం ‘మార్టిన్’. ఈ భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీకి ఎ.పి.అర్జున్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఉద‌య్ కె.మెహ‌తా ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్స్‌పై ఉద‌య్ కె.మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మించారు. ఇందులో నుంచి రీసెంట్‌గా వచ్చిన ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఇక ‘మార్టిన్’ అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు తాజాగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్జున్ సర్జా మాట్లాడుతూ.. ‘మార్టిన్ గురించి చాలా ఖర్చు పెట్టామని చెప్పాల్సిన పని లేదు. టీజర్, ట్రైలర్, పాటలు చూస్తే అందరికీ తెలుస్తుంది. మా చిత్రం అక్టోబర్ 11న రాబోతోంది. దసరాకి చాలా సినిమాలు వస్తున్నాయి. అన్ని చిత్రాలు చూడండి. మా మూవీని కూడా చూడండి. ధృవ సర్జా ఈ చిత్రానికి చాలా కష్టపడ్డాడు. చాలా గ్యాప్ తరువాత ఇలాంటి ఓ కమర్షియల్ చిత్రం రాబోతోందని చెప్పగలను. ఆడియెన్స్ మా సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో ధృవ సర్జా మాట్లాడుతూ.. ‘మార్టిన్ టీంకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మామ అర్జున్ గారు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడ్ని కాదు. నా ఈ మూవీని చూడండి.. నాకు టాలెంట్ ఉందని అనుకుంటే ఆ తరువాత నా సినిమాలను ఎంకరేజ్ చేయండి. లేదంటే వదిలేయండి. కానీ మీకు సినిమా నచ్చితే అందరికీ చెప్పండి’ అని అన్నారు.

దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ.. ‘నా మొదటి హీరో అర్జున్ భయ్యాత. రామా నాయుడు గారు ఆ సినిమాకు వంద రోజుల ఫంక్షన్ చేశారు. అర్జున్‌ను ఇలా చూస్తుండటం ఆనందంగా ఉంది. ఆయన ఈ సినిమాకు స్టోరీ అందించారు. అర్జున్ అల్లుడు ధృవ నటించిన ఈ మార్టిన్ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలి. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.


Similar News