డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పోటికి దిగుతున్న అల్లు అర్జున్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా Vs అల్లు వార్ నడుస్తుంది.

Update: 2024-07-01 14:03 GMT

దిశ, సినిమా: ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా Vs అల్లు వార్ నడుస్తుంది. 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో కష్టపడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలపకుండా.. YCP నేతకు తన మద్దతు ప్రకటించాడు అల్లు అర్జున్. దీంతో నెట్టింట కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. మెగా, అల్లు ఫ్యాన్స్ అంటూ యుద్ధం స్టార్ట్ చేశారు. అయితే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీరకించడంతో ఈ గొడవలు మరింత బలపడ్డాయి. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ స్వయంగా పలకరించకుండా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి వదిలేశాడు అంటూ రచ్చ చేశారు. అయితే.. ఈ గొవడలు ఇంకా కాక మీదే ఉన్న క్రమంలో.. తాజాగా మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో అల్లు అర్జున్ పోటీకి దిగుతున్నట్లు నెట్టింట వార్తలు జోరందుకున్నాయి. అసలు విషయం ఏంటంటే..

ప్రజెంట్ అల్లు అర్జున్ మీద బయట నెగిటివిటీ ఉండటంతో ‘పుష్ప 2’ రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేసిన విషయం తెలిసిందే. మొదట ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు రిలీజ్ చెయ్యడం కరెక్ట్ కాదని భావించిన డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని డిసెంబర్ 6న రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే.. తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత.. పవన్ కల్యాణ్ షెడ్యూల్ చూసుకుని 20 నుంచి 25 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసేయోచ్చు అని చెప్పుకొచ్చాడు. నిర్మాత కామెంట్స్‌ను బేస్ చేసుకుని పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ కూడా డిసెంబర్‌లో విడుదల చేస్తే అదిరిపోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇదే కనుక నిజం అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో అల్లు అర్జున్ పోటీకి దిగుతున్నట్లు అవుతుంది. అయితే.. వీటిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు కాబట్టి.. ఈ వార్తలు ఎంత వరకు నిజం అవుతుందో వేచి చూడాల్సి ఉంది.


Similar News