అమితాబ్ భార్యపై కన్నేసిన బాలీవుడ్ నిర్మాత.. జయపై చెప్పలేనంత క్రష్ ఉందట

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర.. సహనటి, అమితాబ్ భార్య జయా బచ్చన్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Update: 2023-07-07 09:03 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర.. సహనటి, అమితాబ్ భార్య జయా బచ్చన్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ చిత్రంలో ధర్మేంద్ర, జయా బచ్చన్ కూడా నటించారు. కాగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ధర్మేంద్ర.. 1971లో వచ్చిన ‘Guddi’ షూటింగ్ సమయంలో జయపై తనకు క్రష్ ఏర్పడిందని చెప్పాడు. ‘నాకు జయ, అమితాబ్‌లు చాలా కాలంగా తెలుసు. 'షోలే ' షూటింగ్ సమయంలో మేము గడిపిన సరదా సమయాలు ఇప్పటికీ గుర్తున్నాయి. అయితే ‘Guddi’ తెరకెక్కిస్తున్నపుడు జయపైన ఇష్టం పెరిగింది. ఆమె ప్రేమ చాలా గొప్పది. అందరినీ ఆకర్షిస్తుంది’ అన్నాడు. అలాగే తనకు ఇష్టమైన జయ, షబానాలతో మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉందన్న ఆయన.. ‘దేవుడు అలియా, రణ్‌బీర్‌లను ఆశీర్వదిస్తాడు’ అన్నాడు. జూలై 28న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

Read More:   అమీర్-కరిష్మాల ముద్దు సీన్.. ఆగలేక ఆంటీని టచ్ చేసిన తమన్నా ప్రియుడు 

Tags:    

Similar News